Ticket Rates : కర్ణాటకలోనూ తెలుగు మోడల్.. మళ్లీ ప్రేక్షకులకు భారం తప్పదా?

Ticket Rates : సినిమా టికెట్ ధరలకు సంబంధించి కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది.

Update: 2025-09-14 05:30 GMT

Ticket Rates : కర్ణాటకలోనూ తెలుగు మోడల్.. మళ్లీ ప్రేక్షకులకు భారం తప్పదా?

Ticket Rates: సినిమా టికెట్ ధరలకు సంబంధించి కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ఇప్పుడు కర్ణాటకలో సినిమా టికెట్ ధరలు రూ. 200 మించకుండా ఉండాలి. మల్టిప్లెక్స్‌లు అయినా, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయినా, కొత్త సినిమాలు అయినా, పాన్ ఇండియా సినిమాలు అయినా ఈ నియమమే వర్తిస్తుంది. దీంతో ప్రేక్షకులకు సినిమా టికెట్ల ధరలు తగ్గనున్నాయి.

కొత్త టికెట్ ధరల వల్ల సమస్యలు..

ప్రస్తుతం కర్ణాటకలో సినిమా టికెట్ ధరలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 50% నుంచి 100% ఎక్కువగా ఉన్నాయి. అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 200 ధరల విధానం వల్ల పెద్ద బడ్జెట్ సినిమాలకు కొంత నష్టం కలగవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు మోడల్​ను అనుసరిస్తారా?

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా సినిమా టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే, పెద్ద బడ్జెట్ సినిమాలు తమ మొదటి వారం లేదా మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాల నుంచి అనుమతి పొందుతాయి. ఇది సినిమాలకు భారీ కలెక్షన్లను అందించడానికి సహాయపడుతుంది.

ఇప్పుడు కర్ణాటకలో టికెట్ ధరలు తగ్గడంతో, అక్కడి సినీ నిర్మాతలు కూడా తెలుగు మోడల్‌ను అనుసరించాలని కోరుకుంటున్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన సమావేశంలో, రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్స్ షోలు, ఎక్స్‌ట్రా షోలకు అనుమతి ఇవ్వాలని, సినిమా విడుదలైన మొదటి వారంలో టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరనున్నట్లు చర్చ జరిగింది.

ఒకవేళ ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, సినిమా విడుదలైన మొదటి రోజు లేదా మొదటి వారం సినిమా చూడటానికి ఆసక్తి చూపే ప్రేక్షకులకు మళ్లీ భారం తప్పదు.

Tags:    

Similar News