Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' ఎర్లీ ప్రీమియర్స్ రద్దు

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన భారీ చిత్రం 'కాంతార చాప్టర్ 1' ప్రీమియర్స్ రద్దయ్యాయి.

Update: 2025-10-01 05:33 GMT

Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' ఎర్లీ ప్రీమియర్స్ రద్దు

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన భారీ చిత్రం 'కాంతార చాప్టర్ 1' ప్రీమియర్స్ రద్దయ్యాయి. దసరా కానుకగా ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది.

వాస్తవానికి, సినిమాను ఒక రోజు ముందుగానే, అంటే బుధవారం, పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. దీనికి అనుగుణంగా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ జోరుగా సాగినా, అనూహ్యంగా మేకర్స్ అన్ని ప్రీమియర్స్ రద్దు చేసి, టికెట్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ ప్రీమియర్స్ రద్దయ్యాయి.

ఐమాక్స్ స్క్రీన్ల కంటెంట్ సరఫరాలో జాప్యం కారణంగానే ఎర్లీ ప్రీమియర్స్ రద్దైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. కానీ నైజాంలో (తెలంగాణ) మాత్రం సాధారణ రేట్లతోనే సినిమా విడుదల కానుంది. 'కాంతార' మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News