Pokiri: 'పోకిరి సినిమా అనవసరంగా మిస్ చేసుకున్న.. ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నా'..

Pokiri: చంద్రముఖి 2లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియాలో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

Update: 2023-09-25 15:30 GMT

Pokiri: 'పోకిరి సినిమా అనవసరంగా మిస్ చేసుకున్న.. ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నా'

Pokiri: చంద్రముఖి 2లో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియాలో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషించారు. చంద్రముఖి 2 తెలుగు ప్రమోషన్స్‌లో కంగనా పాల్గొంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ మాట్లాడుతూ.. తాను టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం పోకిరిలో భాగం కావడం మిస్ అయ్యానని వెల్లడించింది. పోకిరి కోసం తనను సంప్రదించినప్పుడు గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ అనే హిందీ చిత్రంలో అవకాశం వచ్చిందని నటి తెలిపింది. ఈ రెండు చిత్రాల షూటింగ్ అక్టోబర్ 2005లో షెడ్యూల్ చేశారు. అందుకే పోకిరి సినిమాను వదులకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా ఫీలవుతున్నట్లు తెలిపింది.

దురదృష్టవశాత్తూ షెడ్యూల్ వివాదాల కారణంగా కంగనా పోకిరిని వదులుకోవాల్సి వచ్చింది. పోకిరి చేయనందుకు చింతిస్తున్నానని ఈ నటి ప్రకటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో ప్రభాస్ సరసన పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఏక్ నిరంజన్‌తో అరంగేట్రం చేసింది. నిజంగానే కంగనా రనౌత్ టాలీవుడ్‌లో ఓ భారీ అవకాశాన్ని వదులుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News