లోకేష్‌కు తారక్ విషెస్: ‘హ్యాపీ బర్త్ డే బావా’.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్!

Jr NTR Wishes Nara Lokesh on Birthday: ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు (జనవరి 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

Update: 2026-01-23 07:29 GMT

Jr NTR Wishes Nara Lokesh on Birthday: ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు (జనవరి 23) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటిలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అద్భుతమైన సంవత్సరం కావాలంటూ.. నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను” అంటూ తారక్ పోస్ట్ చేశారు. వరుసకు బావా-బావమరుదులు అయిన వీరిద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధం చూసి అటు నారా, ఇటు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

వీరిద్దరి మధ్య ఉన్న మరో ఆసక్తికర అంశం వారి వయస్సు. లోకేష్, ఎన్టీఆర్ ఇద్దరూ 1983లోనే జన్మించారు. లోకేష్ జనవరి 23న జన్మించగా, ఎన్టీఆర్ మే 20న జన్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే బావ-బావమరుదులు ఇద్దరూ పుట్టడం విశేషం. ఒకరు రాజకీయాల్లో, మరొకరు సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. ఒకరి పుట్టినరోజుకు మరొకరు విష్ చేసుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గతేడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజున లోకేష్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. "బావ-బావమరుదుల బాండింగ్ అదిరిపోయింది" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నందమూరి, నారా అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు. మంత్రిగా బిజీగా ఉన్న లోకేష్.. తన బావమరిది ఎన్టీఆర్ విషెస్‌కు ఎలా రిప్లై ఇస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News