59వ ఏట అడుగు పెట్టిన 'జగ్గు భాయ్'

జగపతిబాబు తెలుగు చిత్రసీమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ రోజు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా బహుముఖ నటులలో ఒకరుగా నిలిచారు.

Update: 2020-02-13 10:53 GMT

జగపతిబాబు తెలుగు చిత్రసీమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ రోజు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా బహుముఖ నటులలో ఒకరుగా నిలిచారు. ఈ రోజు తన 59వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు మరియు ఈ సందర్భంగా, ఆయన కెరీర్‌ను చూద్దాం.

జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఎన్నో సూపర్ హిట్లు అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి ఫ్యామిలీ స్టార్ గా శోభన్ బాబు తరువాత మహిళా ప్రేక్షకుల అభిమానం సంపాయించుకున్నారు జగపతిబాబు. ఆయనకు సినిమాలంటే అమితమైన ప్రేమ, చెప్పాలంటే అయన చదువుకునే సమయంలో రోజుకు మూడు సినిమాలు చూసేవారు.

చదువు పూర్తి అయ్యాక కొన్నిరోజులు విశాఖపట్నం లో ఉన్న బిజినెస్ లను చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు. తరువాత కో-డైరెక్టర్ ద్వారా విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తొలి సినిమాలోనే డబుల్ రోల్ చేసిన మొదటి నటుడు జగపతిబాబు. ఇది చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది.

అయన 1992లో వచ్చిన పెద్దరికం సినిమాతో తోలి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత జగపతి బాబు చాలా సూపర్ హిట్ లో నటించారు. వాటిలో గాయం, శుభలగ్నం, అతడే ఒక సైన్యం, మావి చిగురు, పెళ్లి పందిరి, కబడ్డీ కబడ్డీ, మరియు పెళ్ళైన కొత్తలో వంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి.

1994 లో యస్.వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో నటించారు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంతఃపురం' సినిమాలో చేసిన సారాయి వీరాజు పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరువాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారారు.

25 సంత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొదుకులను ఎదుర్కున్న జగపతిబాబు. లక్ష్యం చిత్రంలో అతని సహాయక పాత్ర 2007 సంవత్సరంలో అతనికి నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఇక హీరోగా చేయడం వద్దనుకొని నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్‌ చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాన్నకు ప్రేమాతో, రంగస్థలం, అరవింద సమేత వంటి చాల చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. 



Tags:    

Similar News