'జాను' నుంచి హార్ట్ ట‌చింగ్ సాంగ్‌

శర్వానంద్‌ కథానాయకుడిగా, సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాను'.

Update: 2020-01-21 15:35 GMT
Jaanu Movie Song Out

శర్వానంద్‌ కథానాయకుడిగా, సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాను'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ సీనీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. తమిళంలో వచ్చిన 96 సినిమాకు రీమేక్ గా జాను సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రోడన్స్ వర్క్ జరుపుకుటుంది.

అయితే తాజాగా ఈ చిత్రంలోని తొలి పాటను సినిమా బృందం విడుదల చేసింది. హృదయానికి హత్తుకునే విధంగా ఉన్న ఓ మెలోడీ సాంగ్ ప్రేమ మాధుర్యాని తెలియజేస్తుంది. ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్స్, ఎమోషన్స్ చూపించే విధంగా ఈ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. సంగీత దర్శకుడు గోవింద్ వసంత బాణీల నుంచి వచ్చిన ఈ పాటను చిన్నయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. ఈ గీతానికి శ్రీమణి లిరిక్స్ అందించారు.

 ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటించగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్రబృదం ప్రయత్నాలు చేస్తుంది. శర్వానంద్‌ రణరంగం సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో పైగా తమిళంలో సూపర్ హిట్ సాధించిన 96 సినిమా రిమేక్ కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు మొదలైయ్యాయి.


Full View

 

Tags:    

Similar News