Naga Chaitanya: నేను మిస్ అయింది మళ్లీ తిరిగొచ్చింది.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం తండేల్ మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకుపోతోంది.
నేను మిస్ అయింది మళ్లీ తిరిగొచ్చింది.. నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Naga Chaitanya: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం తండేల్ మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్‌తో దూసుకుపోతోంది. చాలా రోజుల తర్వాత చైతన్య నటించిన సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో భాగంగా నాగ చైతన్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. 'ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉదయం నుంచే సోషల్ మీడియాలో, ఫోన్ కాల్స్ ద్వారా చాలా మంచి స్పందన వచ్చింది. ఇంత పాజిటివిటీని చాలా కాలం తర్వాత అనుభవిస్తున్నా. సినిమా విడుదలైన మొదటి షో నుంచే హిట్ టాక్ రావడం ఆనందంగా ఉంది. నేను మిస్ అయింది మళ్లీ తిరిగొచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా పెద్ద సంఖ్యలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా నా నటనకు వస్తున్న ప్రశంసల్లో సగం క్రెడిట్ దేవిశ్రీ ప్రసాద్‌కే చెందుతుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. క్లైమాక్స్‌లో ‘బుజ్జి తల్లి’ పాట కొత్త వెర్షన్‌తో అదిరిపోయింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.
కలెక్షన్ల విషయంలో కూడా తండేల్ దూసుకుపోతోంది. ఈ సినిమా తొలిరోజే సుమారు రూ. 18 కోట్ల గ్రాస్ రాబనట్టినట్లు తెలుస్తోంది. పోటీగా పెద్ద సినిమాలేవి లేకపోవడం, వీకెండ్ కలిసి రావడంతో తండేల్ కలెక్షన్లను మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. విదేశాల్లో తొలి రోజు తండేల్ రూ. 3.7 కోట్ల రాబట్టింది. కలెక్షన్లు ఇలాగే కొనసాగితే తండేల్ రూ. 100 కోట్ల జాబితాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.