Jeevitha Rajasekhar: నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు?

Jeevitha Rajasekhar: ఒక లేడీని పట్టుకుని టార్గెట్ చేస్తున్నారని జీవితా రాజశేఖర్ వాపోయారు.

Update: 2021-10-04 15:00 GMT

Jeevitha Rajasekhar: నన్ను ఎందుకు టార్గెట్‌ చేశారు?

Jeevitha Rajasekhar: ఒక లేడీని పట్టుకుని టార్గెట్ చేస్తున్నారని జీవితా రాజశేఖర్ వాపోయారు. ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నా ఆమె నరేష్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. మా లో ఏ పని అయినా ఆగింది అంటే అది అప్పటి అధ్యక్షుడు నరేష్ వల్లనే ఆగిందన్నారు. మంచి చేసేందుకు వెళ్తే తామే చెడు అయ్యామని వాపోయారు. డైరీ విడుదల కార్యక్రమం నుంచి తమ మధ్య విభేదాలు వచ్చాయన్నారు.

గత 'మా' ఎన్నికల్లో నరేష్‌ మాటల్ని నమ్మి తప్పుచేశాం అని, ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదని పేర్కొన్నారు. తప్పులు చేయడం సహజమని, వాటిని సరిదిద్దుకున్నామన్నారు. ఎవరు ఏ ప్యానెల్‌లో ఉంటారన్నది వాళ్ల ఇష్టమన్న జీవిత మా ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలన్నారు.

Tags:    

Similar News