ఈసారి మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారు?
త్రివిక్రమ్ కోసం సరికొత్త అవతారం లో మహేష్ బాబు?
ఈసారి మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారు?
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో త్వరలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. "అతడు" మరియు "ఖలేజా" వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న మూడవ సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. "ధమాకా" భామ శ్రీ లీల కూడా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రొమాన్స్ చేయబోతోంది.
ఈ సినిమాలో త్రివిక్రమ్ మహేష్ బాబు ని ఏ విధంగా చూపించబోతున్నారు అని అభిమానులు ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. "అతడు" లో మహేష్ బాబు చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ ప్రతీ మాటా బుల్లెట్ లా ఉంటుంది. మరోవైపు "ఖలేజా" లో మహేష్ బాబు లో ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త యాంగిల్ చూపించారు త్రివిక్రమ్.
సినిమా లో ఎక్కువ డైలాగులు కూడా మహేష్‌కే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్‌కి చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మూడో సినిమా విషయంలో మహేష్‌ని త్రివిక్రమ్ ఎలా చూపిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మహేష్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ ఇంకా కొత్తగా ఉండబోతున్నాయని వార్తలు కూడా వినిపించాయి. ఇది వరకు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన డైలాగ్ మాడ్యులేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందట.