Nara Rohith: నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో నారా రోహిత్ సుందరకాండ సంచలనం

Nara Rohith: ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఒక సినిమాకి చాలా కీలకంగా మారింది.

Update: 2025-07-26 07:56 GMT

Nara Rohith: నాన్-థియేట్రికల్ బిజినెస్‌తో నారా రోహిత్ సుందరకాండ సంచలనం

Nara Rohith: ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో నాన్-థియేట్రికల్ బిజినెస్ ఒక సినిమాకి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కరోనా తరువాత నాన్-థియేట్రికల్ మీదనే భారీ బడ్జెట్ తో పాటు మామూలు సినిమా మేకర్స్ ఆధార పడుతున్నారు.

సరిగ్గా ఇదే సమయంలో నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం సుందరకాండ ఒక జాక్ పాట్ కొట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 12 కోట్లను సాధించి సంచలనం సృష్టించింది. సుందరకాండ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 9 కోట్లు, హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ను రూ. 3 కోట్లకు అమ్మేసి మొత్తం నాన్-థియేట్రికల్ 12 కోట్లు సాధించడం మామూలు విషయం కాదు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అసలు నాన్-థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టమైపోయింది. కానీ ఈ సినిమాను హాట్ స్టార్ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట. కంటెంట్ మీద నమ్మకంతో సుందరాకాండ టీం హాట్ స్టార్ ను సంప్రదించి సినిమాను చూపించి మరీ డీల్ క్లోజ్ చేయడం గమనార్హం. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం అంటే, సుందరకాండ కథ, కంటెంట్ లో ఏదో అద్భుతం ఉందని స్పష్టమవుతోంది. బలమైన కంటెంట్ ఉంటే ఓటీటీ సంస్థలు భారీగా వెచ్చించి కొనుగోలు చేస్తాయని నిరూపించింది ఈ సుందరాకాండ. ఇక సుందరకాండ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

నారా రోహిత్ కు 20వ చిత్రం కాగా, ఈ సినిమా ద్వారా వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్ తో పాటు వృతి వాఘాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా. సిద్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ బహుసా బహుసా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే టీజర్ కి ట్రెమాండస్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా నారా రోహిత్ కు కంబ్యాక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News