Meharin: నాగార్జునతో సినిమా కోసం కోటి రూపాయలు అడిగిన మెహరీన్

Mehreen Asks 1 Crore for Nagarjuna Movie

Update: 2021-11-18 15:00 GMT

నాగార్జున సినిమా కోసం కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న మెహ్రీన్ (ఫైల్ ఇమేజ్)

Meharin: ఈ మధ్యనే "వైల్డ్ డాగ్" సినిమా తో మెప్పించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం తన తదుపరి సినిమా అయిన "ఘోస్ట్" తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. కానీ త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుండి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అమలాపాల్ ని సంప్రదించారట కానీ ఈ సినిమా కోసం అమలాపాల్ భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది.

దీంతో మెహరీన్ ను సంప్రదించింది ఈ చిత్ర బృందం. కానీ మెహరీన్ కూడా ఈ సినిమాకోసం భారీగానే రెమ్యూనరేషన్ అడిగిందట. నాగార్జున తో రొమాన్స్ చేయడానికి మెహరీన్ అక్షరాల కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లు ఇంత భారీ రెమ్యునరేషన్ లను అడగడం తో దర్శక నిర్మాతలు షాక్ అయ్యారట. ఇక అందుకే ఈ ఇద్దరు హీరోయిన్ల నీ కాదని మరొక హీరోయిన్ కోసం వెతకటం మొదలు పెట్టారు దర్శకనిర్మాతలు. మరోవైపు నాగార్జున తన తదుపరి సినిమా అయిన "బంగార్రాజు" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News