ఎవడ్రా హీరో చిత్ర హీరో బషీద్ అరెస్ట్

ఎవడ్రా హీరో చిత్ర హీరో బషీద్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రుణాలు ఇప్పిస్తానంటూ బషీద్

Update: 2019-12-15 14:34 GMT
హీరో బషీద్‌

ఎవడ్రా హీరో చిత్ర హీరో బషీద్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రుణాలు ఇప్పిస్తానంటూ బషీద్ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాల పేరుతో బషీద్ డబ్బు వసూలు చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో బషీద్ నకిలీ వ్యాపారం చేశాడని.. దుబాయ్ ఎంబీసీ ఇచ్చిన ఫిర్యాదుతో బషీద్‌పై కేసు నమోదైంది. దీంతో బషీద్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.  

Tags:    

Similar News