Harish Shankar: స్క్రిప్ట్ రైటర్గా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హరీష్ శంకర్
Harish Shankar: స్క్రిప్ట్ రైటర్ గా మారనున్న స్టార్ డైరెక్టర్
స్క్రిప్ట్ రైటర్ గా మారిన హరిష్ శంకర్ (ఫైల్ ఇమెజ్)
Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా ఇప్పుడు స్క్రిప్ట్ రైటర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒకరు ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నారు. ఆ డెబ్యూ సినిమా కోసం హరీష్ శంకర్ స్వయంగా స్క్రిప్టు అందించారు. ఈ ప్రాజెక్ట్ కి "వేదాంతం రాఘవయ్య" అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ కూడా ఖరారు చేశారు. దర్శక నిర్మాతలు. మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సత్య దేవ్ ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నారు.
వేదాంతం రాఘవయ్య ఒక లెజెండరీ నటుడు. తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన రాఘవయ్య కేవలం నటుడిగా మాత్రమే కాక కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా మరియు నిర్మాతగా కూడా మంచి సినిమాలను మనకి అందించారు. అక్కినేని నాగేశ్వరరావు ఐకానిక్ సినిమా అయిన "దేవదాస్" నిర్మించింది ఆయనే. అయితే ఆయన జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని హరీష్ శంకర్ ఈ సినిమా కథని రాసుకున్నారా లేక ఆయన రాసుకున్న కథకు కేవలం ఆ టైటిల్ ని పెట్టారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "భవదీయుడు భగత్ సింగ్" సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.