Trisha Krishnan: కీలక నిర్ణయం తీసుకున్న నటి త్రిష.. కెరీర్‌లో తొలిసారి..

Update: 2024-08-27 09:24 GMT

Trisha Krishnan

Trisha Krishnan: సినిమాల్లో ఒకప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లో హీరోయిన్స్‌ పెద్దగా నటించడానికి ఆసక్తి చూపించే వారు. స్పెషల్స్‌ సాంగ్స్‌ కోసం ఇతర భాషలకు చెందిన కొందరు నటీమణులను మేకర్స్‌ తీసుకునే వారు. అయితే ఆ తర్వాత హీరోయిన్స్‌ నటిండచం ఒక ట్రెండ్‌గా మారింది. కేవలం సీనియర్‌ నాయికలు మాత్రమే కాకుండా కెరీర్‌ తొలి నాళ్లలోనే స్పెషల్ సాంగ్స్‌లో నటించిన వారు ఎంతో మంది ఉన్నారు.

వీరి జాబితాలోకి అనుష్క, పూజా హెగ్డే, కాజల్‌ అగర్వాల్‌, సమంత, శ్రియ ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. అయితే అందాల తార త్రిష మాత్రం ఇప్పటి వరకు స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది లేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ త్రిష స్పెషల్‌ సాంగ్‌లో నటిచంలేదు. అయితే తాజాగా త్రిష ఓ స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లోనే తొలిసారి స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

తమిళ హీరో దళపతి విజయ్‌ నటిస్తున్న తాజ చిత్రం GOAT (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది.

ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్‌ ప్రభు అధికారికంగా ప్రకటించారు. విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో త్రిష అతిధి పాత్రలో నటిస్తుందని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆమె ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్‌ప్రభు వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే త్రిష ఇప్పటి వరకు విజయ్‌తో ఏకంగా 5 సినిమాల్లో నటించింది. ఈ కారణంగానే త్రిష ఈ పాటకు ఓకే చెప్పినట్లు సమాచారం.

Tags:    

Similar News