OTT Movie: ఓటీటీలో 2400కోట్లు రాబట్టిన హర్రర్ మూవీ.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సినిమా చూడొద్దు..!

OTT Movie: ఈ మధ్య ఓటీటీలో హర్రర్, క్రైమ్, థ్రిల్లింగ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ టైప్ ఉంటేనే ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు.

Update: 2025-06-26 05:51 GMT

OTT Movie: ఓటీటీలో 2400కోట్లు రాబట్టిన హర్రర్ మూవీ.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ సినిమా చూడొద్దు..!

OTT Movie: ఈ మధ్య ఓటీటీలో హర్రర్, క్రైమ్, థ్రిల్లింగ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ టైప్ ఉంటేనే ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఇక ఇందులో హాలీవుడ్ హర్రర్ సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతుంది. వీటిని ఆయా లోకల్ భాషల్లోకి డబ్బింగ్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో వచ్చిన ఒక హాలీవుడ్ హర్రర్ సినిమా ఏకంగా రూ.2400కోట్లను రాబట్టింది. ఆ సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం.

హాలీవుడ్‌లో ఎక్కువగా ఫ్రాచైజీ, సీరీస్ సినిమాలు తెరకెక్కుతుంటాయి. ఈ సిరీస్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బేస్‌ చేసుకునే ఎంతోమంది సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు ఇదే దారిలో ఈ హాలీవుడ్ సినిమా వచ్చి చేరింది. అంతేకాదు ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు రూ.430 కోట్లు ఖర్చు చేశారు. ఇన్నికోట్లతో ఏం నిర్మించారా బాబూ అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని చూస్తే ఇంకాస్త ఆశ్చర్యపోతారు. ఈ సినిమా నిర్మాతలకు రూ.2400 కోట్లు సంపాదించి పెట్టింది.

ఫ్రాంచైజీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రాంచైజీ నుంచి దాదాపు 14ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీని తెగ ఊపేస్తుంది. జాచ్ లిపోవ్న్కీ , ఆడమ్ స్టెయిన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ట్లిన్ శాంతా జువానా, టియో బ్రియోన్స్, రిచర్డ్ హార్మన్, ఓవెన్ పాట్రిక్ జాయ్నర్ వంటి తదితరులు ప్రధాన పాత్రల్లో పోషించారు.

గత నెల మేలో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ తో పాటు బుక్ మై షో స్ట్రీమ్ ప్లాట్ ఫామ్స్‌లోనూ ఉంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, ఇంకా పలు భాషల్లో ఈ సినిమా ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాను మీరు ఓటీటీలో చూడాలంటే దానికి రెంట్ చెల్లించాల్సి ఉంది. ఈ ఎ రేటెడ్ హర్రర్ మూవీ కోసం రూ.499 లు చెల్లించాలి. అయితే మరికొన్ని రోజుల్లో ఇది ఫ్రీగా అందుబాటులోకి రావొచ్చు.

మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2400 కోట్ల రూపాయాలను సంపాదించింది. థ్రిల్, సస్పెన్స్, హరర్ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో పుష్కలంగా ఉండటమే ఈ సినిమా ఇంత డబ్బును రాబట్టడానికి కారణం. అరె ఇంతలా కాసులు వర్షం కురిపిస్తున్న సినిమాని మీరు కూడా చూసేద్దామని తెగ ఆరాటపడిపోకండి. ఒకవేళ మీలో ఎవరైనా హార్ట్ పేషెంట్లు ఉంటే ఈ సినిమాకి దూరంగా ఉండాలి. అంతేకాదు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఈ సినిమాని చూడొద్దు. పిల్లలు, పెద్దవాళ్లకు కూడా ఈ సినిమాని దూరంగా ఉంచాలి.

Tags:    

Similar News