Pushpa Movie: "పుష్ప" ఫస్టాఫ్ అదుర్స్ అంటున్న సెన్సార్ బోర్డు

Pushpa Movie: పుష్ప సినిమా రివ్యూ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ మెంబర్

Update: 2021-12-15 12:50 GMT

పుష్ప సినిమా రివ్యూ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ మెంబర్

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "పుష్ప: ది రైజ్". భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధంగా ఉంది.ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమాకి సంబంధించిన మొట్టమొదటి రివ్యూని ఇవాళ పోస్ట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా రేసీ గా ఉందని చెప్పుకొచ్చారు ఉమైర్ సంధు. యూకే సెన్సార్ బోర్డులో ఒక మెంబర్ అలానే యుకె మరియు యూఏఈ లో ఇండియన్ సినిమా మాగజైన్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఉమైర్ తాజాగా ఈ సినిమాను చూసి ఎలా ఉందో ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఇక అల్లు అర్జున్ ఇంతకు మునుపెన్నడూ కనిపించినటువంటి సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారని, టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. పుష్పరాజ్ పాత్రలో కనిపించబోతున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక లారీ డ్రైవర్ గా పాత్ర పోషించనున్నారు. ఇక స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలోని ఒక ఐటం సాంగ్ లో బన్నీతో కలిసి స్టెప్పులేసింది. ఈ మధ్యనే విడుదలైన ఈ పాట లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News