DJ Tillu Movie: డీజే టిల్లు ని అర్జున్ రెడ్డి తో పోలుస్తున్న అభిమానులు

DJ Tillu Movie: డీజే టిల్లు ని అర్జున్ రెడ్డి తో పోలుస్తున్న అభిమానులు

Update: 2022-02-16 02:30 GMT

DJ Tillu Movie: డీజే టిల్లు ని అర్జున్ రెడ్డి తో పోలుస్తున్న అభిమానులు

DJ Tillu Movie: "కృష్ణ అండ్ హిజ్ లీలా" ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ఈ మధ్యనే "డిజె టిల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ ని అందరూ టాలీవుడ్ సెన్సేషన్ ఆయన విజయ్ దేవరకొండ మరియు విశ్వక్సేన్ వంటి హీరోలతో పోలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం విజయ్ దేవరకొండ మరియు విశ్వక్సేన్ ల మధ్య కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ గొడవలో సిద్దు జొన్నలగడ్డ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడూ సిద్దు యాక్టింగ్ ని ఆ ఇద్దరి నటులతో పోలుస్తున్నారు అభిమానులు. అయితే నటన పరంగా సిద్దు జొన్నలగడ్డ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ మరియు విశ్వక్సేన్ అంటే గిట్టని వారు సిద్ధు కి జై జై లు కొడుతున్నారు. డీజే టిల్లు సినిమాలో తన పెర్ఫార్మెన్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మరియు కామెడీ టైమింగ్ తో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా మారాడు. సినిమా సూపర్ హిట్ అవడంతో సిద్ధు జొన్నలగడ్డ తదుపరి సినిమాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ యువ హీరో ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో వేచి చూడాలి.

Tags:    

Similar News