ఎఫ్2 చిత్రానికి అరుదైన గౌరవం
విక్టరీ వెంకటేశ్, మెగా హిరో వరుణ్ తేజ్ , తమన్నా, మెహరీన్ నటీనటులుగా తెరకెక్కిన "ఫన్ అండ్ ప్రస్ట్రేషన్" (ఎఫ్2) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సంక్రాంతికి విడుదలైనా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ''ఇండియన్ పనోరమ''లో తెలుగు సినీఇండస్ట్రీ నుంచి ప్రదర్శనకు ఎంపికైంది.
విక్టరీ వెంకటేశ్, మెగా హిరో వరుణ్ తేజ్ , తమన్నా, మెహరీన్ నటీనటులుగా తెరకెక్కిన "ఫన్ అండ్ ప్రస్ట్రేషన్" (ఎఫ్2) చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సంక్రాంతికి విడుదలైనా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ''ఇండియన్ పనోరమ''లో తెలుగు సినీఇండస్ట్రీ నుంచి ప్రదర్శనకు ఎంపికైంది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) ఉత్సవాలు నవంబర్‌లో గోవాలో జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ఎఫ్2 చిత్రాన్నిప్రదర్శిస్తారు.
కాగా.. ఈ చిత్రంలో భార్య భర్తల మధ్య ఉండే సన్నివేశాలు ఎఫ్ 2లో చూపించాడు అనిల్ రావిపూడి. పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకోకపోతే జీవితం ఎలా ఉంటుంది అనే రెండు కథలను చూపించాడు దర్శకుడు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ వెండితెరపై చూపించాడు. సంక్రాంత్రికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాకుండా ప్రక్షకులకు మంచి వినోదన్ని పంచింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కావడంపై నిర్మత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు.