Nandamuri Balakrishna: ఒక ఆరు నెలలు రవితేజను కలవద్దు అంటున్న బాలకృష్ణ
Nandamuri Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ తన ఆన్స్టాపబుల్ టాక్ షో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే...
Nandamuri Balakrishna: ఒక ఆరు నెలలు రవితేజను కలవద్దు అంటున్న బాలకృష్ణ
Nandamuri Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తన ఆన్స్టాపబుల్ టాక్ షో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఈ షో కి మాస్ మహారాజా రవితేజ వచ్చారు. ఈ షో లో కూడా తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. రవితేజ ఈ సినిమాలో ఈ షోలో మాట్లాడుతూ రవితేజ తనకి డైరెక్టర్ గోపీచంద్ మలినేని మంచి స్నేహితుడని వారిద్దరూ ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటారని కూడా అని చెప్పుకొచ్చారు.
"ఎంతసేపు పాత సినిమా హీరోల ని ఎందుకు కలుస్తున్నారు కొత్త సినిమా హీరో లను కలిసి మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వచ్చు కదా" అని బాలకృష్ణ జోక్ చేశారు. గోపీచంద్ మలినేని తదుపరి సినిమా బాలకృష్ణ తోనే అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య సరదాగా అలా అన్నారు. "ఆరు నెలల పాటు రవితేజ ను కలవకు. నన్ను మాత్రమే కలువు.
మనిద్దరం కలిసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశాక ఆ తర్వాత వెళ్లి రవితేజ ని కలువు" అని సరదాగా అనగా, దానికి రవితేజ "సార్ మీరు గోపిని నా దగ్గరికి పంపించొద్దు. నేనే మీ సినిమా సెట్స్కి వచ్చి అతనిని కలుస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. షూటింగ్ సెట్స్ లో కాదని తమ ఇంట్లోనే చిల్ అవుదాం అని రవి తేజ ను ఇంటికి ఆహ్వానించారు బాలకృష్ణ.