అక్కినేని హీరో తో "డీజే టిల్లు" డైరెక్టర్

Naga Chaitanya: *"డీజే టిల్లు" డైరెక్టర్ తో నాగచైతన్య

Update: 2022-06-01 12:00 GMT

అక్కినేని హీరో తో "డీజే టిల్లు" డైరెక్టర్

Naga Chaitanya: సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన "డీజే టిల్లు" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కొత్త డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతో తన సత్తా చాటిన విమల్ ఇప్పుడు ఎవరితో తన రెండవ సినిమా చేయబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం విమల్ కృష్ణ తన రెండవ సినిమాని యువ హీరో నాగ చైతన్య తో లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

నాగచైతన్యతో కృష్ణ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో నాగచైతన్య చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కథ పూర్తిగా ఓకే అయితే తప్ప సినిమాకి సైన్ చేయడం లేదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక తెలుగు తమిళ బైలింగ్వల్ సినిమాని కూడా లైన్ లో పెట్టిన నాగచైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్ద" సినిమాలో కనిపించనున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 11 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.

Tags:    

Similar News