Puri Jagannadh: పూరి జగన్నాథ్ పై మండిపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు
Puri Jagannadh: "లైగర్" నష్టాలు పూరి భర్తీ చేయాలి అని డిమాండ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు
Puri Jagannadh: పూరి జగన్నాథ్ పై మండిపడుతున్న డిస్ట్రిబ్యూటర్లు
Puri Jagannadh: "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ మధ్యనే విడుదలైన "లైగర్" సినిమాతో మాత్రం మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. పూరీ జగన్నాథ్ మరియు చార్మికౌర్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి డిజాస్టర్ అందుకొని భారీ నష్టాలను కలిగించింది. అయితే సినిమా ఫ్లాప్ అయిన కారణంగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మరియు చార్మికౌర్ ముందుకు వచ్చి నష్టాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు తమకు కనీసం 25 కోట్ల రేషియో అయినా కావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం అందులో కేవలం సగం మాత్రమే ఇవ్వగలరని చెబుతున్నారు. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సినిమా రైట్స్ తో కలిపి పూరి జగన్నాథ్ మరియు చార్మి కౌర్ లకు మంచి ప్రాఫిట్ లు వచ్చాయని అయినా సరే వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వటం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబో లో రావాల్సిన "జనగణమన" సినిమా కూడా క్యాన్సిల్ అయిపోయింది.