Parasuram: ప‌ర‌శురామ్ కి రూ.20 కోట్లు..?

* రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన పరుశురామ్

Update: 2023-02-24 10:30 GMT

Parasuram: ప‌ర‌శురామ్ కి రూ.20 కోట్లు..?

Parasuram: "స‌ర్కారు వారి పాట" సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ తన నెక్స్ట్ సినిమాని మాత్రం ఇంకా పట్టాలెక్కించలేదు. ఇప్పటికే పరశురామ్ ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నారు కానీ అందులో ఇంకా ఒకటి కూడా మొదలవలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ ఒక సినిమా అని సైన్ చేశారు. ఈ సినిమా ముందు మొదలవుతుంది అని అందరూ అనుకుంటున్నా సమయంలో పరశురామ్ తమిళ్ హీరో కార్తీ తో ఒక సినిమా సైన్ చేశారు.

ఈ సినిమాకి "రెంచ్ రాజు" అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని వార్తలో వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పరశురామ్ 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. "గీత గోవిందం" సినిమాతో 100 కోట్ల కలెక్షన్లు అందుకున్న పరశురామ్ సినిమాకి 10 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

"సర్కారు వారి పాట" కోసం 13 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న పరశురామ్ విజయ్ దేవరకొండ సినిమాకి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కార్తి సినిమా తో తన రెమ్యూనరేషన్ ను 20 కోట్లకు పెంచేశారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ ఇలా రెండు భాష‌ల్లోనూ విడుదల కానున్న సినిమా ఇది.

Tags:    

Similar News