Narendranath: నిర్మాణంలో అడుగు పెట్టబోతున్న మిస్ ఇండియా డైరెక్టర్
Narendranath: నిర్మాతగా మారబోతున్న ప్రముఖ డైరెక్టర్
డైరెక్టర్ నరేంద్రనాథ్ (ఫైల్ ఇమేజ్)
Narendranath: "మహానటి" బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన "మిస్ ఇండియా" సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నరేంద్రనాథ్. అయితే దర్శకుడిగా తన సత్తా చాటుకున్న నరేంద్ర నాథ్ ఇప్పుడు ప్రొడక్షన్ లోకి దిగబోతున్నారు. అది త్వరలోనే నరేంద్రనాథ్ ఒక నిర్మాతగా మారబోతున్నారు. గోల్డ్ అండ్ డైమండ్ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ బ్యానర్ ని సృష్టించిన నరేంద్రనాథ్ ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ మరియు యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ అందించేందుకు సిద్ధమైన నరేంద్రనాథ్ ఇప్పుడు సినిమా నిర్మాణంలో కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే పలువురు యాక్టర్లు, డైరెక్టర్లు మరియు `టెక్నీషియన్ లో కోసం వెతుకుతున్నారు నరేంద్రనాథ్. మరి నిర్మాతగా నరేంద్రనాథ్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో వేచిచూడాల్సి ఉంది. మరోవైపు ఈ మధ్యనే విడుదలైన "మిస్ ఇండియా" హిందీ వర్షన్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఒక సామాన్య యువతి అమెరికాలో సొంతంగా ఇండియన్ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేసి దేశం గర్వపడేలా చేసిందో అనేది సినిమా కథ. జగపతి బాబు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించారు.