Dil Raju: సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి
Dil Raju: సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది.
Dil Raju: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమై చిత్రాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలు నిర్మిస్తూ కొత్త వారికి కూడా అనేకమందికి ఛాన్సులు కల్పిస్తారనే విషయం తెలిసిందే.దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో ‘పెళ్లి పందిరి’ సినిమాలో పంపిణీదారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం విజయం సాధించడంతో ఆయన పేరు దిల్‌రాజుగా మారింది.