Tollywood: ఏంటీ.. ఇవన్నీ సమంత చేయాల్సిన సినిమాలా.? ఆ పాన్ ఇండియా మూవీ కూడా
Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఏమాయ చేసావే' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
Tollywood: ఏంటీ.. ఇవన్నీ సమంత చేయాల్సిన సినిమాలా.? ఆ పాన్ ఇండియా మూవీ కూడా
Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఏమాయ చేసావే' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ, తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. జెస్సీ పాత్రలో తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ, తెలుగుతెరపై స్టార్ ఇమేజ్‌ను సాధించింది. ఎక్కువ సినిమాలు హిట్స్ కావడంతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత వివాహాం, విడాకులు అటు వెంటనే మయోసైటిస్ వ్యాధి బారిన పడడం వంటి అంశాలు సమంతను ఢీలా పడేలా చేశాయి.
అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ సమంత కమ్‌బ్యాక్ ఇస్తోంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే సమంత తన కెరీర్‌లో కొన్ని సినిమాలను మిస్ చేసుకుందని మీకు తెలుసా.? కారణాలు ఏవైనా సమంత వదులుకున్న కొన్ని బ్లాక్ బస్టర్ మూవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* నాని హీరోగా నటించిన నిన్నుకోరి సినిమాకు దర్శకుడు మొదటగా సమంతను అనుకున్నాడు. కానీ అప్పట్లో ఆమె డేట్స్ ఖాళీ లేకపోవడంతో అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
* అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప మూవీలో మొదట సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారంటా అయితే అప్పట్లో సమంత వైవాహిక జీవితానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సినిమాకు నో చెప్పిందని సమచారం. అయితే ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌లో నటించిన విషయం తెలిసిందే.
* శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఐ సినిమాలో మొదట సమంతనే అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించలేదు. చివరకు ఆ స్థానాన్ని అమీ జాక్సన్ భర్తీ చేసింది.
* రామ్‌చరణ్ – అల్లు అర్జున్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఎవడు ఈ సినిమాలో కూడా సమంతను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే, ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో సినిమా చేయలేకపోయింది.
* బాలీవుడ్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రానికి కూడా మొదట సమంతను ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ఆమె హిందీ సినిమాల్లో అప్పట్లో ఆసక్తి చూపకపోవడంతో ఈ అవకాశం వదిలేసింది.