Mohan Babu- Soundarya: సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించాడు అంటూ వార్తలు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య భర్త

Soundaryas Death Controversy: దివంగత సినీ నటి సౌందర్య మరణం సహజం కాదా. సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా. అమె మరణించిన 20ఏళ్ల తర్వాత పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు. అందులో నిజం ఎంత?

Update: 2025-03-13 01:30 GMT

Soundaryas Death Controversy: టాలీవుడ్ మరో సావిత్రి అంటే సౌందర్యనే గుర్తుకు వస్తుంది. పద్దతిగా ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ సాధించడం అంత తేలికైన విషయం కాదు. దాదాపు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించిన సౌందర్య..పెళ్లి తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సౌందర్య..హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

సౌందర్య మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. సౌందర్య మరణించి దాదాపు 20ఏళ్ల పైనే అవుతోంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ సమయంలో సౌందర్యది సహజమరణం కాదని..హత్య చేయించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. సౌందర్యను స్టార్ హీరో మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఆరోపణలు చేశాడు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తి కోసం మోహన్ బాబు కావాలనే సౌందర్యను హత్య చేయించారంటూ ఆరోపణలు చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలోని జల్ పల్లిలో ఉంటున్నారు.

ఖమ్మం జిల్లా రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికిచెందిన ఏదురుగట్ల చిట్టి బాబు ఈ ఆరోపణలు చేశాడు. సౌందర్యను హత్య చేయించింది మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు లో మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు.

అయితే ఈ అంశంపై సౌందర్య భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని తెలిపారు. సౌందర్య మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మోహన్ బాబు పేరు ఉపయోగిస్తూ పోస్టులు దర్శనమిచ్చాయి. దీంతో ఆయనకు మద్దతుగా సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తికి సంబంధించిన కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆమె ఆస్తిని నటుడు మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను. ఆయనతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. వారి కుటుంబంతో మాకు 25ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తాను. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాము. మాకెలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవని పేర్కొన్నారు.

Tags:    

Similar News