Deepika: దీపికా-రణ్‌వీర్‌ల కలల సౌధం.. వైరల్ అవుతోన్న రూ. 100 కోట్ల ఇల్లు వీడియో..
అత్యంత విలాసవంతంగా, అధునాతన సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారు.
Deepika: దీపికా-రణ్‌వీర్‌ల కలల సౌధం.. వైరల్ అవుతోన్న రూ. 100 కోట్ల ఇల్లు వీడియో
విలాసంతమైన జీవితం అనగానే మొదట బాలీవుడ్ సినీతారలే గుర్తొస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బాలీవుడ్ తారల ఇల్ల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. తాజాగా ఇలాంటి కలల సౌధాన్ని నిర్మించుకున్నారు బాలీవుడ్ క్యూట్ కపుల్ దీపికా, రణ్‌వీర్. ముంబయిలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మన్నత్‌కు సమీపంలో ఈ ఇంటిని నిర్మిస్తుంచుకుంటున్నారు ఈ జంట. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అత్యంత విలాసవంతంగా, అధునాతన సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారు. సముద్రానికి తీరానికి ఎదురుగా బాంద్రా ప్రాంతంలో చేపట్టిన ఈ ఇంటి నిర్మాణానికి ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న సెలబ్రిటీల జాబితాలో ఒకరిగా నిలవనున్నారీ జంట. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చివరి దశలో ఉంది. కాగా ప్రస్తుతం తల్లికాబోతున్న దీపికా.. బిడ్డకు జన్మనివ్వగానే కొత్తింటిలోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ జంట గతంలో కూడా ఇలాంటి ఓ విలాసంతవమైన ఇంటిని కొనుగోలు చేశారు. 2021లో అలీబాగ్‌లో రూ. 22 కోట్ల ఇంటిని కొనగోలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ ఇంటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు వామ్మో రూ. 100 కోట్ల ఇల్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీపికా, రణ్‌వీర్‌ల విషయానికొస్తే కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఆ తర్వాత 2018లో వివాహ బంధంతో ఒక్కటైనా విషయం తెలిసిందే. దీపికా చివరిగా కల్కి చిత్రంలో నటించారు. కాగా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కల్కి చిత్రంలో దీపికా గర్భిణీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దీపికా కల్కి2 చిత్రంలో నటించనుంది. ఇక రణ్‌వీర్ ప్రస్తుతం డాన్‌లో నటిస్తున్నారు.