RaviReja: రికార్డులు క్రియేట్‌ చేస్తున్న 'క్రాక్‌' సినిమా

RaviReja: హీరో రవితేజ 'క్రాక్‌' సినిమా రికార్డ్‌ల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది.

Update: 2021-03-26 07:22 GMT

'Crack' మూవీ:(ఫోటో ది హన్స్ ఇండియా) 

RaviReja: హీరో రవితేజ 'క్రాక్‌' సినిమా రికార్డ్‌ల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. మొన్న వెండి తెరపై కాసుల వర్షం కురిపిస్తే.. నిన్న ఓటీటీలో హయ్యెస్ట్‌ వ్యూవర్స్‌ చూసిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు బుల్లితెరపై 11.7 టీఆర్పీ రేటింగ్‌ పాయింట్స్‌ తెచ్చుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య రిలీజైన 'క్రాక్‌' మూవీ మంచి విజయం సొంతం చేసుకుంది. 50శాతం సీటింగ్‌తో కూడా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్‌ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.

సంక్రాంతి బరిలో మొట్టమొదటి సినిమాగా వచ్చిన క్రాక్, డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. నిర్మాతతో పాటు బయ్యర్లంతా లాభపడ్డారు. ఫైనల్ రన్ లో ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసిన ఈ మూవీ ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ సినిమా, ఫైనల్ గా బుల్లితెరపై కూడా ప్రభంజనం చూపించింది. ఈ ఏడాది టాప్ రేటింగ్స్ లో క్రాక్ కూడా స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. క్రాక్ ఇచ్చిన ఉత్సాహంతో రెమ్యూనరేషన్ పెంచడంతో పాటు వరుసపెట్టి సినిమాలు కూడా ఎనౌన్స్ చేశాడు రవితేజ. 

Tags:    

Similar News