CPI Narayana: బిగ్‌బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. నాగార్జున ఆ డబ్బులు..
Bigg Boss Show: బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CPI Narayana: బిగ్‌బాస్ షోపై నారాయణ సంచలన వ్యాఖ్యలు.. నాగార్జున ఆ డబ్బులు..
Bigg Boss Show: బిగ్‌బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్కూ మొహం తెలియని వారందరినీ ఒక ఇంట్లో కట్టిపడేసి కోతుల ఆటలు ఆడిస్తున్నారు. బిగ్ బాస్ షో సామాజిక రుగ్మతన్న ఆయన.. ఈషో చెడు సంకేతాలను చూపించే ఒక దరిద్రపు షోగా అభివర్ణించారు. బిగ్ బాస్ తీసేవారికి తప్ప వేరే ఎవరికి ఉపయోగం లేదన్నారు. నాగార్జున వారి నాన్న నాగేశ్వరరావు ఎన్నో గొప్ప సినిమాలు తీశారు, ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఈ ముదనష్టపు షో డబ్బులు మీకెందుకని ప్రశ్నించారు. డబ్బు వ్యామోహంలో యువత అమూల్యమైన శక్తి సామార్థ్యాలను సమయాన్ని వృధా చేసుకుంటోందన్నారు. బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమైన సందర్భంగా నారయాణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.