హీరో రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా!

Rajashekar Family : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి

Update: 2020-10-17 08:49 GMT

Rajashekar Family 

Rajashekar Family : కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. అయితే ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే తాజాగా టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కుటుంబానికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

"నాకు, జీవితకు, మా ఇద్దరు కుమార్తెలు శివానీ, శివాత్మికకు కరోనా పాజిటివ్‌ గా రిపోర్ట్‌ వచ్చింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాం " అని రాజశేఖర్ వెల్లడించారు. అయితే ఇందులో శివానీ, శివాత్మిక కరోనా నుంచి కోలుకున్నారని, తానూ జీవిత ఇంకా చికిత్స పొందుతున్నట్టుగా రాజశేఖర్ వెల్లడించారు. ఇక తాము త్వరలోనే ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నట్టుగా రాజశేఖర్ పేర్కొన్నారు.

ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన గరుడవేగ సినిమా మంచి సక్సెస్ కావడంతో రాజశేఖర్ హీరోగా మళ్ళీ బిజీ అయిపోయారు. గత ఏడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చారు రాజశేఖర్.. ప్రస్తుతం ఆయన నటించిన అర్జున్‌ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ భావించారు కానీ కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది. అటు రాజశేఖర్ కుమార్తెల కూడా తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News