కూలీ మూవీ ట్విటర్ రివ్యూ: నాగార్జున స్టైలిష్ విలనిజం అదిరింది, రజనీకాంత్ మాస్ పర్ఫామెన్స్‌తో 200% మెగా బ్లాక్ బస్టర్ టాక్!

రజనీకాంత్ హీరో, నాగార్జున విలన్‌గా నటించిన కూలీ మూవీపై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్, ట్విటర్ రివ్యూలు అదరగొడుతున్నాయి.

Update: 2025-08-14 06:44 GMT

Coolie Movie Twitter Review: Nagarjuna’s Stylish Villainy & Rajinikanth’s Mass Performance Get 200% Mega Blockbuster Talk

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున విలన్‌గా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ ఇవాళ (ఆగస్ట్ 14) గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. విక్రమ్, ఖైదీ 2, లియో లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, పూజా హెగ్డే, సత్యరాజ్ వంటి అగ్ర నటీనటులు నటించారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం – సన్ పిక్చర్స్ నిర్మాణం

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి యువ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

కూలీ ట్విటర్ రివ్యూ – ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్!

విడుదలకి ముందే పలు చోట్ల ప్రీమియర్ షోలు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2కి పోటీగా వచ్చిన కూలీపై సోషల్ మీడియాలో నెటిజన్ల ఫస్ట్ రివ్యూలు వస్తున్నాయి.

ఒక యూజర్ ఇలా రాశారు – "కూలీ ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్ లా ఉంది. లోకేష్ కనగరాజ్ జీనియస్, అనిరుధ్ బీజీఎమ్ సూపర్, రజనీకాంత్ లెజండరీ ఆరా, నాగార్జున రాయల్ స్వాగ్—all in one movie. ఇది కేవలం హిట్ కాదు… 200% మెగా బ్లాక్ బస్టర్!"

మరో నెటిజన్ రివ్యూ – "యూకేలో ప్రీమియర్ చూశాను. ఫస్ట్ హాఫ్ బాగుంది. స్క్రీన్‌ప్లే పక్కా మాస్. నాగార్జున విలన్‌గా మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ చంపేశాడు. బీజీఎమ్ ఫాంటాస్టిక్!"

ఇంకో యూజర్ – "చెన్నైలో స్పెషల్ షో చూశాను. రజనీకాంత్ ఎంట్రీ అదిరింది. పర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్. లోకేష్ కనగరాజ్ క్లాస్, మాస్ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు" అని 5/5 రేటింగ్ ఇచ్చారు.

నాగార్జున విలన్ స్వాగ్‌కి సోషల్ మీడియాలో ఫిదా

ప్రేక్షకులు ప్రత్యేకంగా నాగార్జున స్టైలిష్ విలనిజాన్ని ప్రశంసిస్తున్నారు. "మన్మథుడు అని ఊరికే అంటారా? ఆ స్వాగ్, ఆ స్మోకింగ్ స్టైల్ ఏంటో నాగ్ మావ!" అంటూ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Tags:    

Similar News