Anil Ravipudi: బంపర్ ఛాన్స్ కొట్టేసిన అనిల్ రావిపూడి..

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా అన్నారు. కుదర్లేదు. వెంకీ కుడుముల మేకింగ్ లో కామెడీ దాడి అన్నారు.

Update: 2023-07-18 09:04 GMT

Anil Ravipudi: బంపర్ ఛాన్స్ కొట్టేసిన అనిల్ రావిపూడి..

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా అన్నారు. కుదర్లేదు. వెంకీ కుడుముల మేకింగ్ లో కామెడీ దాడి అన్నారు. జరగలేదు. కాని అనిల్ రావిపూడి మేకింగ్ లో కామెడీ యాక్షన్ డ్రామా ఓకే అయ్యేలా ఉంది. సంక్రాంతికి సర్వం సిద్దమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది... అనిల్ కి టైం బాగా కలిసొస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ఆగస్ట్ 11 న రాబోతోంది. ఆతర్వాత కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో చిరు సినిమా సెట్స్ పైకెళుతుంది. ఆ తర్వాత ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరికింది. కళ్యాణ్ కృష్ణ తో చిరు సినిమా అయిపోగానే, సంక్రాంతికి అనిల్ రావిపూడి మేకింగ్ లో మెగాస్టార్ మూవీ పట్టాలెక్కుతుందట. ప్రస్థుతానికి హైదరాబాద్ ఔట్ స్కట్స్ లో భగవంత్ కేసరి క్లైమాక్స్ ని తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి.

నిజానికి పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ అంటూ ఒక్కో మెట్టెక్కిన అనిల్ రావిపూడి, ఎఫ్ 2 నుంచి లెక్క మార్చాడు. అలా వెంకీ, ఆతర్వాత సరిలేరు నీకెవర్వరంటూ మహేశ్ బాబుని టార్గెట్ చేసుకున్నాడు. ట్రెండ్ మార్చాడు. నిజంగా ఒక్కో స్టేజ్ నుంచి మార్కెట్ ని స్టామినాని పెంచుకుంటూ వస్తున్న అనిల్ రావిపూడి. ఇప్పడు మహేశ్, బాలయ్య అంటూ పెద్ద హీరోల సినిమాలతో దూసుకెలుతున్నాడు.

రాజమౌళి తర్వాత వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న దర్శకులలో కొరటాల శివ, అనిల్ రావిపూడి ఉండేవాళ్ళు. కాని ఆచార్య ఫ్లాప్ తో ఆ లిస్ట్ లోంచి కొరటాల శివ బయటికొస్తే, జక్కన్న తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి కంటిన్యూ అవుతున్నాడు. చిరుతో ప్లాన్ చేసిన మూవీని సంక్రాంతికి సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడట అనిల్ రావిపూడి. 

Tags:    

Similar News