Chhaava OTT Release: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి ఛావా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

Chhaava OTT Release: విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఛావా’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-04-10 06:42 GMT

Chhaava OTT Release: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఓటీటీలోకి ఛావా స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..! 

Chhaava OTT Release: విక్కీ కౌశల్‌ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఛావా’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ ఓటీటీ అధికారిక తేదీని ప్రకటించింది.

ఛావా మూవీ ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రిలీజ్ చేయగా, అభిమానుల్లో హైప్‌ మరింత పెరిగింది. లక్ష్మణ్‌ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, చరిత్రలో అత్యంత ధైర్యవంతుడిగా పేరుగాంచిన శంభాజీ మహారాజ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కింది. శంభాజీగా విక్కీ కౌశల్‌ అత్యద్భుతంగా నటించగా, ఆయన భార్య యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న ఆకట్టుకున్నారు. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మరోసారి రికార్డులు తిరగరాయబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇంతకీ కథేంటంటే?

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ మరణం తర్వాత మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ (అక్షయ్‌ ఖన్నా) మరాఠా సామ్రాజ్యాన్ని తేలికగా జయించొచ్చని భావిస్తాడు. అయితే అతని ఆశలను ఆడియాసలు చేస్తూ శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్‌ రంగంలోకి దిగుతాడు. దక్షిణ భారతంలో మొగల్‌ దురాక్రమణను అడ్డుకోవడమే కాదు, ప్రజల ఆస్తులను దోచుకున్న ఔరంగజేబ్‌ కోశాగారాలపై దాడులకు దిగుతాడు.

ఈ క్రమంలో ఔరంగజేబ్‌ స్వయంగా దక్కన్‌కి సైన్యంతో వచ్చి శంభాజీని ఆపాలని నిర్ణయించుకుంటాడు. శక్తిమంతమైన మొగల్‌ సేనకు ఎదురుగానే కాక, తన మీద ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శంభాజీ సాగించిన పోరాటమే ‘ఛావా’లో చూపించారు. అతని పోరాట పటిమ, వ్యూహాలు, శత్రువుల్లో దాగిన ద్రోహులు ఎవరూ? చివరకు శంభాజీ తన లక్ష్యాన్ని సాధించగలిగాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Tags:    

Similar News