Actress: ఈ ఫొటోలో టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress: సినిమా ఇండస్ట్రీకి హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా పరిచయం అవుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే.
Actress: ఈ ఫొటోలో టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress: సినిమా ఇండస్ట్రీకి హీరోల కంటే హీరోయిన్లే ఎక్కువగా పరిచయం అవుతుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇతర భాషల హీరోయిన్ల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తాజాగా ఓ బ్యూటీ వరుసగా తెలుగు సినిమాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అందంతో పాటు అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. పైన కనిపిస్తున్న ఫొటోలోనే ఆ అందాల తార ఉంది. ఎవరో గుర్తు పట్టారా.?
నిజానికి 2021లోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది ఇప్పుడు వరుసగా విజయాలను అందుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? ఆ బ్యూటీ మరెవరో కాదండి. అందాల తార మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). పైన ఫొటోలో ఎడమ వైపు నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉంది. సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా రాణించిన మీనాక్షికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ ఫ్యామిలీకి చెందిన మీనాక్షి చదువుతో పాటు క్రీడల్లోనూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇక 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచిన మీనాక్షి ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైందీ చిన్నది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో మీనాక్షి పేరు పెద్దగా వినిపించలేదు. అయితే ఈ ఏడాది మీనాక్షి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా హిట్ 2 మూవీతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులకు చేరువుంది.
ఇక వెంటనే గూంటూరు కారంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత మట్కాలోనూ తళుక్కుమంది. ఈ సినిమా విజయాన్ని సాధించకపోయినా మీనాక్షి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్‌తో తొలి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుందీ బ్యూటీ. ఈ సినిమా విజయంలో మీనాక్షికి వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలకు సైన్ చేసిన మీనాక్షి బిజీ హీరోయిన్‌గా మారింది.