bigg boss3 episode40:ప్రయాణం పూర్తయింది

బిగ్ బాస్ ఎక్స్‌ప్రెస్ లో దేశం చుట్టేశారు హౌస్ మేట్స్. మధ్యలో చిన్నచిన్న టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈరోజు కూడా రైలు ప్రయాణం కొనసాగింది. పునర్నవి..రవిల రొమాన్స్ శృతి మించింది.

Update: 2019-08-30 01:50 GMT

బిగ్ బాస్ ఎక్స్‌ప్రెస్ లో దేశం చుట్టేశారు హౌస్ మేట్స్. మధ్యలో చిన్నచిన్న టాస్క్ లు ఇచ్చాడు బిగ్ బాస్. ఈరోజు కూడా రైలు ప్రయాణం కొనసాగింది. పునర్నవి..రవిల రొమాన్స్ శృతి మించింది. శ్రీముఖి..అలీల ప్రేమాయణమూ కొనసాగింది. చేపలు పట్టారు.. కొబ్బరి వలిచారు.. మధ్యలో చేపలు పట్టే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అలీ చొక్కా విప్పి మరీ చేపలు పట్టాడు. కొబ్బరి వలిచే టాస్క్ లో బాబా భాస్కర్ వరుణ్ పై గెలిచారు. పళ్లతో కొబ్బరి కాయలు వలిచి ఆకట్టుకున్నారు.

ఎర్రగడ్డ లవ్..పిచ్చెక్కింది.. ఓ ఐదు నిమిషాల సినిమా తీయమని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. బాబా భాస్కర్ దర్శకత్వంలో ఎర్రగడ్డ లవ్ స్టోరీ అంటూ అందరికీ పిచ్చెక్కించారు. హడావుడిగా.. క్రమ పద్ధతి లేకుండా ఏదేదో చేసేశారు కెప్టెన్ రేసులో ముగ్గురు ఈ ప్రయాణం టాస్క్ లో ఎవరు బాగా చేశారో ముగ్గురిని ఎంపిక చేసుకోమని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి సూచించాడు. బాబా భాస్కర్..రాహుల్..వరుణ్ ముగ్గురినీ హౌస్ మేట్స్ సూచించారు. దీంతో వీరి మధ్య కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని ప్రకటించారు బిగ్ బాస్ మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా చప్పగా సాగింది. కొంత గందరగోళంగా అనిపించింది. టాస్క్ పెద్దది కావడం..దానిని గంటలో చూపించాల్సి రావడం..ప్రేక్షకులని గందరగోళపరిచాయి.

Tags:    

Similar News