Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్..?
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతోంది. దీంతో ఈసారి విన్నర్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్..?
Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో గ్రాండ్ ఫినాలేకు సిద్ధమవుతోంది. దీంతో ఈసారి విన్నర్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనే చర్చ నడుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నాడు. కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడిపించి ఓటింగ్ రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అవినాష్ టాప్5లోకి చేరుకోగా మరో నలుగురి కోసం ఈ టాస్క్‌లను నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుతం నామినేషన్‌లో విష్ణుప్రియ, గౌతమ్, నిఖిల్, రోహిణి, నబీల్, ప్రేరణ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ పరంగా చూస్తే మొదటి స్థానంలో గౌతమ్ ఉండగా రెండో స్థానంలో నిఖిల్, మూడో స్థానంలో ప్రేరణ, నాలుగో స్థనాంలో రోహిణి, ఐదవ స్థానంలో విష్ణుప్రియ, చివరి స్థానంలో నబీల్ ఉన్నాడు. అంటే మొత్తం మీద ఈ వీక్‌లో విష్ణుప్రియ, నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరిద్దరిలో ఒకరూ హౌజ్ నుంచి ఎలిమినేట్ కానున్నారని వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ఒక్క కంటెస్టెంట్‌ను మాత్రమే ఎలిమినేట్ చేయనున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. అయితే పోల్స్ విషయంలో కూడా కొంత గందరోళం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వార్తల ప్రకారం నబీల్, ప్రేరణ, రోహిణి కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అన్ని రకాల పోలింగ్స్‌లో డేంజర్ జోన్‌లో ఉన్న కామన్ కంటెస్టెంట్ యాంకర్ విష్ణు ప్రియ అని చెప్పొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే ఈ వారం హౌజ్ నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే డబులు ఎమిలిమేషన్ అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం రోహిణి ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.? టాప్ 5లోకి చేరుకునే మిగతా 4గురు ఎవరనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటికి సంబంధించి క్లారిటీ రావాలంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే.