Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్..

Sarayu Roy: యూట్యూబర్, బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్ సరయుపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే.

Update: 2022-02-08 01:30 GMT

Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్..

Sarayu Roy: యూట్యూబర్, బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్ సరయుపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా సరయును బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌ కోసం గతేడాది నిర్వహించిన లఘుచిత్రం.. హిందూ సమాజాన్ని, మహిళలను కించపర్చే విధంగా ఉందంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్‌ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేయగా పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ మేరకు యూట్యూబ్ నటి సరయుని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. సరయూతోపాటు ఆమె బృంద సభ్యులైన దర్శక నిర్మాత, శ్రీకాంత్‌రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్‌ చేశారు.

Tags:    

Similar News