Bigg Boss Season 6 Telugu: బిగ్‌బాస్‌-6 ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే..?!

Bigg Boss Season 6 Telugu: బిగ్‏బాస్ 6వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

Update: 2022-09-03 15:30 GMT

Bigg Boss Season 6 Telugu: బిగ్‌బాస్‌-6 ఫైనల్‌ కంటెస్టెంట్లు వీళ్లే..?!

Bigg Boss Season 6 Telugu: బిగ్‏బాస్ 6వ సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే హౌజ్‌ కూడా రెడీ అయిపోయింది. సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వినోదం పంచనున్నారు. తాజాగా ఈసారి షోలో పాల్గొనబోతున్న కంటెస్టెంట్ల పేర్లు ఉన్న ఓ లిస్ట్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వీరిలో 20మంది పేర్లు బయటికి వచ్చాయి. అందులో మొదటి పేరు శ్రిహాన్. బిగ్ బాస్ సిరి కి కాబోయే భర్త అయిన శ్రీ హాన్ కూడా సిరి హౌస్ లో ఉన్నప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అదే క్రేజ్ ను ఇంకా బాగా ఉపయోగించాలి అని నిర్ణయించుకున్న శ్రీహాన్ తానే స్వయంగా కంటెస్టంట్ గా మారిపోయాడు. యాంకర్‌ నేహా చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్ లో చేరిపోయింది.

సోషల్‌ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫేమ్ కమెడియన్‌ చంటి, నటుడు బాలాదిత్య, షాన్ని, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప(పింకీ), యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, కీర్తి కూడా బిగ్ బాస్ లో కంటెస్టంట్స్ లాగా మారబోతున్నారు. ఆర్జీవీ వీడియోతో పాపులర్‌ అయిన ఇనాయా సుల్తానా కూడా బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. లేడీ కమెడియన్‌ ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌ లతో పాటు ఈ సారి కూడా వరుణ్ సందేశ్ - వితికా లాగా రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనాలను తీసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కామనర్స్‌ కూడా ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు అని సమాచారం కానీ ఆ కామనర్స్ గురించిన వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News