Bigg Boss 8 Telugu Elimination: ఈ వారం ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్.. ఒకరు కాదు ఇద్దరు.?
Bigg Boss 8 Telugu Elimination Week 4: సోనియాను బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలకు బలం చేకూరుతోంది. అలాగే ఆదిత్య ఓంను కూడా ఎలిమినేట్ చేయనున్నారని టాక్.
Bigg Boss 8 Fourth Week Elimination
Bigg Boss 8 Fourth Week Elimination: బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. 14 మంది హౌజ్ మేట్స్ మొదలైన ఈ సీజన్ రసవత్తరంగా మారుతోంది. ఇందులో భాగంగానే హౌజ్ మేట్స్ మధ్య గొడవలు, అలకలతో ఎపిసోడ్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇప్పటికే హౌజ్ నుంచి బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎగ్జిట్ కానున్నారు.
దీంతో ఆ వ్యక్తి ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ వారం ఆదిత్య ఓం, సోనియా ఆకుల, పృథ్వీ శెట్టి, ప్రేరణ, నబీల్, నాగమణికంఠ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో పృథ్వి, ఆదిత్య, సోనియాకు తక్కువ ఓట్లు వచ్చినట్లు వార్తలు వచ్చినట్లు తెలుస్తోంది. హౌజ్‌లో సోనియా వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన ప్రేక్షకులు ఆమెకు తక్కువ మార్కులు వేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది సోనియానే అంటూ పెద్ద ఎత్తున పుకార్లు చేస్తున్నాయి.
అయితే సోనియాను బిగ్‌బాస్ ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న వార్తలకు బలం చేకూరుతోంది. అలాగే ఆదిత్య ఓంను కూడా ఎలిమినేట్ చేయనున్నారని టాక్. అయితే సోనియాను ఎలిమినేట్ చేసినట్లే చేసి, సీక్రెట్ రూమ్‌లో ఉంచే అవకాశాలు ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో మొదట ఇద్దరిని ఎలిమినేట్ చేసినట్లు ప్రకటించి ఆ తర్వాత మళ్లీ సోనియాను సీక్రెట్ రూమ్‌కు పంపించనున్నారనే అనే చర్చ నడుస్తోంది.
ఇక బిగ్‌బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని ఇప్పటికే నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా సోనియా మళ్లీ హౌజ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలన్నా.? ఈ క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పడాలన్నా మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.