Bigg Boss 3 Updates: బిగ్ బాస్ హోస్ట్ గా మళ్లీ నానీ?

బిగ్ బాస్ హోస్ట్ గా నానీ వస్తున్నారట. నిజమేనా?

Update: 2019-09-08 08:55 GMT



ఏమిటీ నాగార్జునకి మళ్లీ ఏమైంది? నానీ బిగ్ బాస్ లోకి రావడమేమిటి? అనుకుంటున్నారా? అబ్బే అదేమీ లేదండీ.. బిగ్ బాస్ హోస్ట్ గా ఆదివారం ఆటవిడుపు అంటూ ఎవరో ఒకర్ని తీసుకువచ్చి ఆడించడం మన నాగార్జునకి అలవాటేగా. అందుకే ఈసారి నానీ ని తీసుకువస్తున్నారు. నానీ గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఆ సినిమా ప్రచారం కోసం బిగ్ బాస్ షో కి వస్తున్నారు. పనిలో పనిగా అందరితో ఆటాడేసి వెళ్ళిపోతారు. అదీ సంగతి. బిగ్ బాస్ 2 కి నానీ హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఆదివారం షో కి వస్తుంటే అందరికీ ఆసక్తి మొదలైంది. ఇందుకు సంబంధించిన ప్రోమొలను స్టార్ మా విడుదల చేసింది.


అందులో నాగార్జునతో నానీ చేస్తున్న హంగామా కనిపించింది. నానీ స్టైల్ అల్లరితో.. నాగార్జున మార్క్ ఎంటర్టైన్మెంట్ ఈ ఎపిసోడ్ లో దొరుకుతున్దనిపిస్తోంది ప్రోమోలు చూస్తుంటే. అన్నట్టు.. నానీని చూసి హౌస్ మేట్స్ అందరూ తెగ హాశ్చర్యపోతున్నట్టు కనిపిస్తున్నారు ప్రోమోలో ఎందుకబ్బా అంత ఆశ్చర్యం?


Tags:    

Similar News