Bigg Boss 3 Telugu Episode 50: అగ్రెసివ్ అలీ వెళ్లిపోయాడు! భోరుమన్న హౌస్ మేట్స్!!

బిగ్ బాస్ దాదాపు సగం పూర్తయింది. 50 ఎపిసోడ్స్ పూర్తీ అయిపోయాయి ఆదివారంతో. ఇక అందరూ అనుకున్నట్టే అలీ రెజా ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి వెళ్ళిపోయారు . అలీ వెళ్ళిపోతున్న సమయంలో హౌస్ మేట్స్ మొత్తం కన్నీళ్లు పెట్టుకున్నారు.

Update: 2019-09-08 16:44 GMT

బిగ్ బాస్ దాదాపు సగం పూర్తయింది. 50వ ఎపిసోడ్ ఆదివారం ముగిసింది. ఇప్పుడున్న హౌస్ మేట్స్ అందరూ మొదట్నుంచీ బిగ్ బాస్ లో కొనసాగుతున్నారు. ఒక్క శిల్ప మాత్రమే గత వారం హౌస్ లోకి వచ్చారు. నాగార్జున ఆదివారం వస్తూనే ఇప్పటివరకూ జరిగిన ఎపిసోడ్స్ హైలైట్స్ టీవీలో చూపించారు హౌస్ మేట్స్ కి. ఇక తరువాత స్పెషల్ గెస్ట్ గా నానీ వచ్చారు. ఆయన వస్తూనే హోస్ మేట్స్ అందర్నీ ఎవరికీ వారు నానీకి పరిచయం చేసుకున్నారు. తరువాత హౌస్ మేట్స్ కి తన గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూపించారు.

అందరితోనూ కొద్దిసేపు తన గ్యాంగ్ లీడర్ సినిమా విశేషాల్ని పంచుకుని నానీ వెళ్ళిపోయారు.

అలీ అవుట్..భోరుమన్న శివజ్యోతి!

ఇక ఆదివారం సరదా వారమే కాకుండా హౌస్ నుంచి ఒకర్ని బయటకు పంపించే రోజు కూడా. నిన్న ఎలిమినేషన్ నామినీస్ గా మిగిలిన నలుగురిలో మహేష్ విట్టా, శ్రీముఖి, రావిక్రిష్ణ, అలీరేజా లు నలుగురినీ వరుసగా నిలబెట్టారు. అక్కడ ఎవరి మీద లైట్ పడితే వారు సేఫ్ అని నాగార్జున చెప్పారు. శ్రీముఖి మీద మొదట లైట్ పడింది. దాంతో ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఇక అలీ, రవి, మహేష్ లలో ఎవరి మీద లైట్ పడితే వాళ్ళు హౌస్ లోంచి వెళ్లిపోతారని చెప్పిన నాగార్జున పది లేక్కపెత్తగానే లైట్ అలీరేజా మీద పడింది. ఏడు వారాల బిగ్ బాస్ లో ఈ ఒక్కసారే అలీ నామినేషన్స్ కి వచ్చాడు. అవకాశం లేకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియగానే.. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడ్చింది. హౌస్ మేట్స్ అందరూ అలీ బయటకు వెళ్లడంపై బాధపడ్డారు. అంతా ఏడుస్తూ ఆయనకు వీడ్కోలు చెప్పారు.

మొత్తమ్మీద సరదాగా మొదలై.. ఏభై వ ఎపిసోడ్ హౌస్ మేట్స్ అందరి బాధతో పూర్తయింది. హౌస్ మేట్స్ జర్నీ చూపించి అందర్నీ ఎంటర్టైన్ చేయడం బావుంది.


Tags:    

Similar News