Actress: భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.?
Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగినంత కాలం, హీరోయిన్లు ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగినంత కాలం, హీరోయిన్లు ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించిన హీరోయిన్లు కూడా ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైన సందర్భాలు ఉన్నాయి. కొంత మంది వివాహం తర్వాత కూడా సినిమాలను కొనసాగిస్తూ అడపాదడపా ప్రేక్షకులను పలకరిస్తుంటే మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.
ఈ జాబితాలోకి వస్తుంది అందాల తార శరణ్య మోహన్. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తనదైన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ఈ సినిమాతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కడుతాయని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా జరిగింది.
తర్వాతి చిత్రంలో కళ్యాణ్ రామ్ చెల్లిగా నటించింది. కత్తి సినిమా తర్వాత శరణ్యకు పెద్దగా అవకాశాలు రాలేవు. కొన్ని రోజుల తర్వాత శరణ్య.. తన చిన్ననాటి స్నేహితుడు అరవింద్ కృష్ణన్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇక ఆమె పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారి ఆలనాపాలన చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చక్కబెడుతుంది.
సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్ అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా క్లాసిక్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.