Prabhas - Bhagyashree: ప్రభాస్ ని కొనియాడుతున్న హీరోయిన్ భాగ్యశ్రీ

* ప్రభాస్ సెట్ మీద ఉన్న అందరూ తన కుటుంబం అన్నట్టే అందరితోనూ ప్రవర్తిస్తాడు

Update: 2021-09-21 16:00 GMT

ప్రభాస్ - భాగ్యశ్రీ(ఫైల్ ఫోటో)

Prabhas-Bhagyashree: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "రాధేశ్యామ్" పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు మునుపెన్నడూ చూడనటువంటి పీరియడ్ ఫాంటసీ ప్రేమకథగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రియదర్శి, సచిన్ ఖేడేకర్ మరియు "మైనే ప్యార్ కియా" ఫేమ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ప్రవర్తన గురించి భాగ్యశ్రీ గొప్పగా చెబుతున్నారు.

"ప్రభాస్ సెట్ మీద ఉన్న అందరూ తన కుటుంబం అన్నట్టే అందరితోనూ ప్రవర్తిస్తాడు. సెట్ లోకి వచ్చిన వెంటనే అందరినీ పలకరిస్తాడు. ప్రభాస్ ఎప్పుడూ షూటింగ్లో ఉన్నా తన ఫుడ్ మాత్రం ఇంటి నుంచి రావాల్సిందే. మేమందరం కలిసి కూర్చుని ప్రభాస్ ఇంటి నుండి తెచ్చినవే తినేవాళ్ళం," అని చెప్పుకొచ్చారు భాగ్యశ్రీ. యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14 న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతుంది

Tags:    

Similar News