Baby Movie Collections: రెండో రోజే భారీ లాభాల్లోకి.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Baby Movie Collections: ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బేబీ’.
Baby Movie Collections: రెండో రోజే భారీ లాభాల్లోకి.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
Baby Movie Collections: ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో సాయి రాజేశ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బేబీ’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. తొలి రోజు రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండు రోజు అంతకు మించి కలెక్షన్లను సాధించింది. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'బేబీ'.. రెండో రోజు కూడా అంతకంటే కాస్త ఎక్కువనే సాధించింది.
మొత్తంగా రెండు రోజుల్లో రూ.14.3 కోట్ల గ్రాస్ వచ్చిందని స్వయానా నిర్మాత ఎస్కేఎన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే సినిమాకు రూ.7 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అయింది. దీనిబట్టి చూస్తే రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు లాభాల్లోకి కూడా వెళ్లిపోయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆనంద్, వైష్ణవిలు తమ నటనతో అలరించారు. యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
బేబీ రెండు రోజుల వసూళ్లు
నైజాం-5.8 కోట్లు
వైజాగ్-1.73 కోట్లు
ఈస్ట్- 83 లక్షలు
వెస్ట్-46 లక్షలు
కృష్ణా-74 లక్షలు
గుంటూరు-61 లక్షలు
నెల్లూరు-37 లక్షలు
సీడెడ్-1.18 కోట్లు
కర్ణాటక-రెస్టాఫ్ ఇండియా- 43 లక్షలు
ఓవర్సీస్-2.84 కోట్లు