Baby Movie: పదో రోజు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన బేబి.. మహేశ్, బన్నీ సినిమాలని మించి..

Baby Movie 10 Days Collections: చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా.. అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2023-07-24 12:41 GMT

Baby Movie: పదో రోజు ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన బేబి.. మహేశ్, బన్నీ సినిమాలని మించి..

Baby Movie 10 Days Collections: చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా.. అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూత్‌ నుంచి పెద్దల వరకు ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడుతున్నారు. దీంతో ఈసినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. 10వ రోజు ఇరగదీసింది. ఏకంగా మీడియం రేంజ్ మూవీస్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. ఈ సినిమా 10వ రోజు 3.40 కోట్ల రేంజ్‌లో షేర్ ని సొంతం చేసుకుని మీడియం రేంజ్ మూవీస్‌ అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టి టాప్ స్థానానికి వెళ్లింది. దీని కంటే ముందు వరకు ఉప్పెన మూవీ 2.61 కోట్లతో ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది బేబి.

ఇక పది రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఏపీ తెలంగాణలో 27.85 కోట్ల షేర్ వచ్చింది. 51.10 గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 31.71 కోట్ల షేర్ రాగా.. 60.40 గ్రాస్‌ను సాధించి వావ్ అనిపించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', 'శ్రీమంతుడు', 'భరత్ అను నేను' చిత్రాలతో పాటు అల్లు అర్జున్ 'సరైనోడు' కలెక్షన్స్‌ని అధిగమించిందని స్వయంగా దర్శకుడు సాయి రాజేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయిపోయింది.

ఈ సినిమాలో విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి రాజే‌శ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విరాజ్‌ అశ్విన్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. యూట్యూబ్‌ స్టార్‌గా సుపరిచితమైన వైష్ణవి చైతన్య.. ఈ సినిమాలో నటనతో అందర్నీ మెప్పించింది.


Tags:    

Similar News