Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ ఇలా మారిపోయిందా.. ఫొటోలు చూస్తే అవాక్కే..
Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ ఇలా మారిపోయిందా.. ఫొటోలు చూస్తే అవాక్కే..
Arjun Reddy: అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇండస్ట్రీనే షేక్ చేసిన ఈ సినిమా.. విజయ్ దేవర కొండకే కాదు, సందీప్ వంగా కెరీర్‌నే మలుపు తిప్పేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పింది. కీలక పాత్రలకే కాదు, సినిమాలో నటించిన ఎంతోమందికి బాగానే ఛాన్స్‌లు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ డైరెక్టర్ సందీప్ రెడ్డి కావడం గమనార్హం. బాలీవుడ్‌లోనూ బంపర్ హిట్ అందుకుంది. అయితే, ఈ సినిమాలో ఓ హీరోయిన్ తన అందంతో కట్టిపడేసింది. ప్రేక్షకులను తన నటనతోనూ మెప్పించింది. ఆమె పేరు షాలిని పాండే. అయితే, ఈ సినిమా తర్వాత ఈ బ్యూటికి మాత్రం బ్రేక్ దక్కలేదు.
అలాగే, ఈ సినిమాలో మరో అమ్మాయి ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది. ఆమె పేరే జియా శర్మ. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాతోనే తెలుగులో ఫేమస్ అయింది. కానీ, ఈ నటికి అవకాశాలు రాలేదు. అయితే, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న జియా శర్మ.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను తన హాట్ ఫొటోలతో ఫిదా చేస్తోంది.