Oscars 2025 Best Picture Anora: అనోరా" మూవీ.. ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన రొమాంటిక్ డ్రామా..!

Anora: ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల వేడుకలో "అనోరా" సినిమా అద్భుత విజయాన్ని సాధించింది.

Update: 2025-03-03 07:47 GMT

Oscars 2025 Best Picture Anora: అనోరా" మూవీ.. ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన రొమాంటిక్ డ్రామా..!

Anora: ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల వేడుకలో "అనోరా" సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. లాస్‌ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో శోన బేకర్ దర్శకత్వం వహించిన "అనోరా" సినిమా ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను గెలుచుంది.

భారీ బడ్జెట్ చిత్రాల మధ్య "అనోరా" సినిమా విభిన్న కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. "రెడ్ రాకెట్", "ది ఫ్లోరిడా ప్రాజెక్ట్" లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన శోన బేకర్ ఈసారి ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం తీసుకొచ్చారు. ఈ సినిమాలో కథ మొత్తం 23 ఏళ్ల వేశ్య అయిన "అని" (మైకి మాడిసన్) చుట్టూ తిరుగుతుంది. బ్రూక్లిన్‌లో నివసించే ఆమె ఒక రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వాన్య (మార్క్ ఎడెల్‌స్టేన్) తో కలుస్తుంది. వాన్య ఆమెను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు.

వేశ్యగా జీవించే "అని" జీవితంలో జరిగిన ఈ ఆశ్చర్యకరమైన మలుపు ఆమెను ఒక పెద్ద సమస్యకు గురిచేస్తుంది. వాన్యను వదిలేస్తే ఆమెకు 10 వేల డాలర్లు ఇస్తామని వాన్య తల్లితండ్రులు ఆమెకు ఆఫర్ చేస్తారు. అనీ ఈ ఆఫర్‌ను స్వీకరించి వాన్యను వదిలేసిందా? చివరకు ఆమెకు ఏమి జరిగిందనే కథతో సినిమా సాగుతుంది.

అనోరా 2024 అక్టోబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 6 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.52 కోట్లు)తో నిర్మించబడింది, కానీ బాక్సాఫీస్ వద్ద 41 మిలియన్ డాలర్లు (రూ.358 కోట్లు) వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.

ఇదే కాకుండా, ఈ సినిమా పలు అవార్డులను కూడా పొందింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ఈ చిత్రం 'పామ్ డి ఓర్' అవార్డును కూడా గెలుచుకుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ రూపొందించిన 10 అత్యుత్తమ చిత్రాల జాబితాలో ఈ సినిమా నిలిచింది.

ప్రస్తుతం "అనోరా" చిత్రం అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+ వంటివి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూడడానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News