Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపుడి సినిమా?
Anil Ravipudi: అనిల్ రావిపుడి టాలీవుడ్ లో నాలుగు స్థంబాలాట ఆడుతున్నాడు.
Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపుడి సినిమా?
Anil Ravipudi: అనిల్ రావిపుడి టాలీవుడ్ లో నాలుగు స్థంబాలాట ఆడుతున్నాడు. ఆల్రెడీ రెండు స్తంభాల్లాంటి వెంకీ, బాలయ్యతో మూవీలు తీశాడు.. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునానే.. ఇప్పడు మెగా ఆఫర్ తో అనిల్ రావిపుడి లెక్కే మారేలా ఉందట. ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట.
భగవంత్ కేసరి అంటూ దసరాను టార్గెట్ చేశాడు అనిల్ రావిపుడి. అలా బాలయ్యతో చేసిన ప్రయోగంతో నవరాత్రికి కాసుల పంటే అంటున్నాడు. ఆల్రెడీ వెంకటేష్ తో ఎఫ్ 3 హిట్ తో స్వింగ్ లో ఉన్న తనకి, ఈ సారి హిట్ పడితే, మూడో హ్యాట్రిక్ కి గేట్లు తెరుచుకున్నట్టే అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇండస్ట్రీకి నాలుగుస్థంబాల్లాంటి వాళ్లు చిరు, నాగార్జున, బాలయ్య, వెంకటేష్.. ఇందులో ఇప్పటికే ఇద్దరితో సినిమాలు తీసేశాడు అనిల్ రావిపుడి. కొత్తగా చిరుతో సినిమా తీసే ఛాన్స్ పట్టాడు. దీపావళి నుంచి వేగం పెంచబోతున్నాడు.
చిరు కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి జై చిరంజీవ అంటూ కామెడీ దాడి చేసి చాలా కాలమైంది. ఇప్పుడు అనిల్ రావిపుడి మేకింగ్ లో దిల్ రాజు తీసే సినిమా పట్టాలెక్కితే, లెక్క మారిపోతుంది. పెద్ద హీరోలతో కామెడీ కమ్ యాక్షన్ డ్రామా జోనర్లో సక్సెస్ సొంతం చేసుకుంటున్న దర్శకుడిగా అనిల్ కి మంచి రికార్డు ఉంది.
వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీలతో హిట్లు సొంతం చేసుకున్న అనిల్ రావిపుడి, బాలయ్యతో భగవంత్ కేసరి తీస్తున్నాడు. ఆతర్వాతు మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ ప్లాన చేసుకున్నాడు. ఆతర్వాత టార్గెట్ నాగార్జునానే అంటున్నారు. బంగార్రాజు టైంలోనే కుదరాల్సిన కాంబినేషన్ కుదర్లేదట. సో చిరు తర్వాత నాగ్ తో మూవీ ఓకే అయితే టాలీవుడ్ నాలుగు స్థంభాలాటలో సక్సెస్ అయిన దర్శకుడిగా అనిల్ కి రికార్డు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక మెగాస్టార్ తో అనిల్ రావిపుడి దీపావళికి లాంచ్ అవుతుందట. సంక్రాంతి నుంచి షూటింగ్ షురూ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ తో పాటు దసరా రిలీజ్ తర్వాతే అనిల్ ఫ్రీ అవుతాడు. ఆతర్వతే అంటే దీపావళికి చిరు మూవీ లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేస్తారని తెలుస్తోంది.