Anand Devarakonda: "పుష్పక విమానం" టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: "అందుకే సినిమాకి పుష్పకవిమానం అనే టైటిల్ పెట్టాం" అంటున్న ఆనంద్ దేవరకొండ

Update: 2021-11-11 12:00 GMT

పుష్పక విమానం (ఫైల్ ఇమేజ్)

Anand Devarakonda: పుష్పక విమానం అనగానే తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తు వచ్చేది 1987లో కమల్ హాసన్ మరియు అమల హీరోహీరోయిన్లుగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలై బ్లాక్ బస్టర్ గా మారిన సినిమా. మాటలు లేకుండా పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచిన సినిమా అయిన "పుష్పక విమానం" గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా ఇప్పుడు అదే టైటిల్ తో ఆనంద్ దేవరకొండ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ నిర్మించారు.

దామోదర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. తాజాగా చిత్ర టైటిల్ గురించి మాట్లాడుతూ సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర ముందుగానే పుష్పకవిమానం టైటిల్ కోసం అనుమతి తీసుకున్నామని తెలిపారు ఆనంద్. అంతేకాకుండా సినిమా కథకు ఈ టైటిల్ చాలా బాగా సెట్ అవుతుంది అని మాత్రమే ఈ టైటిల్ని ఎంచుకున్నట్లు చెప్పారు దేవరకొండ. టైటిల్ అనుమతి కోసం సింగీతం శ్రీనివాసరావు గారికి ఫోన్ చేయగా ఆయన ఆ టైటిల్ తను సృష్టించిన పేరు కాదని అది ఇతిహాసాలు లోనే ఉందని కాబట్టి ఆ టైటిల్ ని ఎవరైనా వాడుకోవచ్చునని ఆయన అన్నారు అని చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ.

Tags:    

Similar News