Allu Arjun: పుష్ప టీమ్ మీటింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2022-02-19 04:34 GMT

Allu Arjun: పుష్ప టీమ్ మీటింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్ 

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో పుష్ప సెకండ్ పార్ట్ అయిన "పుష్ప: ది రూల్" పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిత్ర బృందంతో మాట్లాడడానికి ఒక మీటింగు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చిత్ర దర్శకుడు సుకుమార్ నిర్మాతలు మరియు ముఖ్య నటీనటులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

ఈ మీటింగ్లో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ కి విడుదల చేయాలని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ మార్చి మధ్యలో నుంచి షూటింగ్ మొదలు పెట్టి నాలుగు నెలల్లో షూటింగ్ని పూర్తి చేయమని సుకుమార్కి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వివిధ భాషల్లో విడుదలైన పుష్ప సినిమా హిందీలో కూడా భారీగా హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే పుష్ప సెకండ్ పార్ట్ తో హిందీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. అలాగే హిందీ లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా ఎక్స్పెక్ట్ చేస్తోంది "పుష్ప" బృందం.

Tags:    

Similar News